ఎవరూ చెప్పనవసరం లేదు .. సాయం చేయడం తెలుసు: శ్రుతి హాసన్

  • మీరెంతగా సాయపడుతున్నారో తెలుసుకోవాలనుంది
  • ఎవరో చెప్పారుగదా అని చేసే అలవాటు నాకు లేదు
  • గతంలో సాయపడిన సందర్భాలు చాలానే వున్నాయన్న శ్రుతి
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా శ్రుతిహాసన్ కి మంచి క్రేజ్ వుంది. కొంతకాలంగా కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టని శ్రుతిహాసన్, మళ్లీ ఇప్పుడిప్పుడే తన కెరియర్ ను గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఆమె విరాళాన్ని ప్రకటించకపోవడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు.

అందుకు శ్రుతి హాసన్ తనదైన శైలిలో స్పందిస్తూ .. "నాకు చెప్పేవారు కరోనా బాధితులకు ఎంతగా సేవ చేస్తున్నారో తెలుసుకోవాలని వుంది. మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే, భగవంతుడు మనకి కూడా అంతగా సహాయం చేస్తాడని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి నేను ఎవరితోనూ చెప్పించుకోవాలని చూడను. ఏ సాయమైనా నాకు చెయ్యాలనిపిస్తుంది .. చేస్తాను. అంతేగానీ ఇతరులు ఆదేశించారు గదా అని చేసే అలవాటు మాత్రం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి" అంటూ సమాధానమిచ్చింది.

Sruthi Hassan
Actress
Tollywood

More Telugu News